విజయవాడ:అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే సుజనా
విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను పశ్చిమ ఎమ్మెల్యే సుజన చౌదరి పరిశీలించారు. ఆలయ ఈవో కేఎస్ రామారావుఇతర ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే సుజనా మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన దుర్గగుడి మాస్టర్ ప్లాన్ ను పరిశీలించామనిఅభివృద్ధికి అవసరమయ్యే సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.