పేదవాని ఆకలి తీర్చేందుకు ఎంతో పవిత్ర లక్ష్యంతో చేపట్టిన అన్న క్యాంటీన్ల ద్వారా అన్న దానం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వీటిని స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని దాతలు కూడా అన్ని విధాలా ముందుకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గురువారం రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో విజయవాడ లో నూతనంగా అన్న క్యాంటీన్ ను సియం ప్రారంభించి ప్రజలకు స్వయంగా అన్నం వడ్డించారు.