వరద వల్ల దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొంటుందని రైతులకు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హామీ ఇచ్చారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తోట రావులపాడు, చింతలపాడు, ఏటూరు గ్రామాల్లో సౌమ్య పర్యటించారు. ముంపునకు గురైన పంట పొలాలను సందర్శించి రైతులను పరామర్శించారు. మండలంలోని ప్రజలను, రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.