ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురువారం వింజమూరులోని టిడిపి కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతమైన ఏడవ డివిజన్ లో గత కొన్ని రోజులుగా సహాయక చర్యలు అందించి, నేడు ఆయన వింజమూరుకు వచ్చారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు భారీ స్వాగతం పలికారు. కాగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఉదయగిరి ప్రముఖులు బాధితులకు సహాయం చేశారు.