నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఉన్న 14 లైట్లు మరమ్మతులకు గురై కొన్ని రోజులుగా వెలగడం లేదు. దీంతో రాత్రిపూట బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు, ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ దిలీప్ కుమార్ పంచాయతీ నిధుల ద్వారా గురువారం 9 లైట్లుకు మరమ్మతులు చేయించారు. మిగిలిన ఐదు లైట్లుకు కూడా త్వరలో మరమతులు చేస్తామని తెలిపారు.