వరదల్లో నష్టపోయిన వారి వివరాలు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, వీఆర్వోలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశించారు. విజయవాడ 7వ సచివాలయంలో మంగళవారం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వరద బాధితులు అందరిని గుర్తించి ఏవ్వరు మిస్ కాకుండా సర్వే చేయాలన్నారు. ప్రభుత్వం తరఫున అందించే సాయం ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయనతోపాటు పలువురు అధికారులు ఉన్నారు.