నెల్లూరు నగరంలో ట్రంకు రోడ్డు తరహాలో పొదలకూరు రోడ్డును అభివృద్ధి చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం నెల్లూరు రూరల్ పరిధిలోని 36వ డివిజన్ బట్వాడి పాలెం సెంటర్ లో రూ.1.50కోట్ల నిధులతో డివైడర్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. త్వరలో పొదలకూరు రోడ్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.