భారీ వర్షాల దృష్ట్యా గురువారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరులో బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున ఇప్పటికే మూడు రోజులు పాటు సెలవు ప్రకటించామన్నారు. గురువారం కూడా పాఠశాలలకు, అంగన్వాడీ లకు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించారు. శుక్రవారం నుండి పాఠశాలలు కొనసాగుతాయని తెలిపారు.