నెల్లూరులో 13వ డివిజన్ హెచ్పి గోడౌన్ సమీపంలోని నాలుగు పార్కుల సెంటర్ వద్ద పార్కు ముందు అడ్డంగా అర్ధరాత్రి పూట జరుగుతున్న అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసిపి నాయకులు 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జునతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సోమవారం కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణం స్పందించాలని కోరారు.