మాజీ జెడ్పిటిసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందల వెంకట శేషయ్య కు వచ్చే నెల 6 వరకు కోర్టు మంగళవారం రిమాండ్ విధించింది. భర్త చనిపోయిన ఓ మహిళను లైంగికంగా వేధించాడని వెంకటాచలం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన క్రమంలో పోలీసులు వెంకట శేషయ్య పై కేసు నమోదు చేసి న్యాయమూర్తి ముందు హాజరపరిచారు. జనవరి 6 వరకు జిల్లా కోర్టు వెంకట శేషయ్యకు రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు.