జిల్లా కోర్టులో ప్రభుత్వం తరఫున సివిల్ కేసులు భూసేకరణ వివాదాలు వాదించే గవర్నమెంట్ ప్లీడర్ గా నెల్లూరుకు చెందిన సీనియర్ న్యాయవాది చుండూరి శ్రీహరి నారాయణ రావును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. వీరు గత 30 సంవత్సరాలుగా నెల్లూరులో న్యాయవాదిగా వృత్తి నిర్వహిస్తున్నారు. వీరు జిపిగా చార్జ్ తీసుకున్నప్పటినుంచి మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.