నెల్లూరు చెరువులో 15వ తేదీన సాయంత్రం 4 గంటలకు పొదలకూరు రోడ్డు లేక్ వ్యూ కాలనీ వద్ద తెప్పలు పోటీలు నిర్వహిస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం నెల్లూరు చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ప్రజలందలూ కుటుంబాలతో విచ్చేసి ఈ పోటీలను వీక్షించాలని కోరారు.