నెల్లూరు నగరంలోని 9 డివిజన్ బంగ్లా తోటకు చెందిన సిపిఎం శాఖ సభ్యుడు కామ్రేడ్ బాణాల వెంకటేశ్వర్లు బుధవారం గుండెపోటుతో మరణించారు. ఆయన అంత్యక్రియల సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, ఎం మోహన్ రావు, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు, ఆయన మృతదేహంపై అరుణ పథకాన్ని కప్పి జోహార్లు అర్పించారు.