నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి జంగిల్ క్లియరెన్స్ కోసం ఆయా స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూర్య తేజ సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా బుధవారం నెల్లూరు బివి నగర్ కేఎన్ఆర్ పాఠశాల రోడ్డు, లెప్రసీ హాస్పిటల్ రోడ్డు, 22/1 మదర్ తెరిసా సచివాలయం పరిసర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు.