నెల్లూరు నగరం గోమతి నగర్లోని మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఫ్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె క్రైస్తవ సోదరీమణులు, చిన్నారులు, 28వ డివిజన్ల టీడీపీ మహిళా నాయకురాళ్లతో కలిసి కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు.