విద్యుత్ చార్జీల పెరుగుదలకు నిరసనగా ఈనెల 27న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పోరుబాటకు సంబంధించిన వాల్ పోస్టర్లను మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.