వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కి మైండ్ పోయి మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో ఈ మేరకు మంగళవారం వీడియో రిలీజ్ చేశారు. రెడ్ క్రాస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ మంత్రి నారాయణపై చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.