నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అనుమతుల మేరకే భవన నిర్మాణాలు జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పర్యవేక్షించాలని, ఆక్యూపెన్సి సర్టిఫికెట్ ను పరిశీలించాకే అనుమతులు మంజూరు చేయాలని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. బుధవారం కమిషనర్ చాంబర్లో జిల్లా వైద్య శాఖ అధికారి, విద్యుత్, ఫైర్, ఆరోగ్య శాఖాధికారి, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.