నెల్లూరు నగరంలో స్కూళ్ల పక్కన మద్యం షాపులు పెడుతున్నారని దీనిపై మంత్రి హోదాలో ఉన్న నారాయణ ఏం సమాధానం చెప్తారని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గం ఇంచార్జ్ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. జగదీష్ నగర్ లో మద్యం షాపులకు వ్యతిరేకంగా మహిళలు చేపట్టిన ఉద్యమానికి బుధవారం సాయంత్రం ఆయన సంఘీభావం తెలియజేశారు. టిడిపి నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.