13 మంది లబ్ధిదారులకు 7,63,731/- రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు. కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 3 గంటలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 13 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి పేదప్రజల వరంలాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆరు నెలల్లోనే చాలామందికి సీఎం సహాయనిధి అందజేశామన్నారు.