ఏటా జనవరి మాసం రెండవ మంగళవారం అల్లూరుపేట ప్రజల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగే పోలేరమ్మ జాతరకు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పాల్గొన్నారు. మంగళవారం ఆయన అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అల్లూరు జనసేన నాయకులు కారుమంచి కార్తీక్, శర్మ సివి రమణ ఆహ్వానం మేరకు ఉత్సవాల్లో పాల్గొన్నామని తెలిపారు.