ఇస్రో ఈ నెల 9న నిర్వహించాల్సిన అనుసంధాన (డాకింగ్) ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. తొలుత ఈ నెల 7వ తేదీనే డాకింగ్ నిర్వహించాలని ఇస్రో భావించినప్పటికీ సాంకేతిక కారణాలతో 9వ తేదీకి వాయిదా పడింది. జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్‌ను ఇటీవల ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 225 మీటర్లకు చేర్చేందుకు ఓ పక్రియ నిర్వహించగా, రెండింటి మధ్య దూరం ఊహించిన దాని కంటే ఎక్కువ ఉన్నట్లు తేలింది. దీంతో జనవరి 9న (గురువారం) నిర్వహించాలనుకున్న డాకింగ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ఇస్రో .. ఉపగ్రహాలు సురక్షితంగా ఉన్నాయని తెలిపింది. అయితే డాకింగ్ తదుపరి తేదీని మాత్రం ప్రకటించలేదు.