వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో కాలువలకు నీళ్లు వదిలే సమయంలో పంట కాలవల్లో గుర్రపు డెక్క, సిల్టు తొలగించక పోవడం దారుణమని బిజెపి నమామి గాంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నెల్లూరులోని పంట కాలువలను పరిశీలించారు. జాఫర్ సాహెబ్ కెనాల్, సర్వేపల్లి కాలువ, కృష్ణపట్నం కాలువ, తదితర చోట్ల పూడికతీత పనులు, యుద్ధ ప్రాతిపదికన జరిపించాలని డిమాండ్ చేశారు.