నెల్లూరు నగరంలో తుఫాను ప్రభావం అధికంగా ఉంది. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షంతో చిరు వ్యాపారులు, రోజువారి కష్టజీవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం సహాయ చర్యలను ముమ్మరం చేసింది.