పార్టీలు వేరైనా ప్రజలచే ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం పని చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచించారు. విడవలూరు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని స్థానిక అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, తెలుగుదేశం నాయకులు ఘన స్వాగతం పలికారు.