కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ప్రజలు, అధికారులకు సూచనలు చేశారు. నియోజకవర్గం ప్రజలందరూ తుఫాన్ తీవ్రత పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా అక్టోబర్ 14, 15 తేదీల్లో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల తల్లులు, వయో వృద్దులు ఇల్లు విడిచి బయటకు రావద్దన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు, సచివాలయం సిబ్బంది అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.