కావలి పట్టణ సమీపంలోని చౌదరిపాలెం కు చెందిన సాయి కార్తీక్ (26) ఆదివారం మృతి చెందాడు. సాయి కార్తీక్-ఆదిలక్ష్మి కి వివాహమై ఏడాదియింది. భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. వీరికి ఒక నెల బాబు ఉన్నాడు. చౌదరిపాలెం కు రావాలని భర్త చెప్పడంతో రెండు నెలల తర్వాత వస్తానని భార్య చెప్పింది. మనస్థాపానికి గురైన కార్తీక్ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల్లూరులో చికిత్స పొందుతూ మృతి చెందాడు.