కావలి పట్టణంలోని 19వ వార్డులో బాలకృష్ణ రెడ్డి నగర్ ప్రధాన రహదారిపై వర్షపు నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఉదయం నుంచి కురుస్తున్న ఏకతాటి వర్షానికి రోడ్డుపై వర్షపునీరు వాగులా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై మూడు అడుగుల లోతులో నీరు ప్రవహిస్తుంది. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కనీసం ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా అవకాశం లేదంటున్నారు.