నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని టి. ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా షేక్ నాగూర్ వలి నియమితులయ్యారు. గుంటూరులోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఉర్దూ జూనియర్ అధ్యాపకునిగా పనిచేస్తూ పదోన్నతి పొంది కందుకూరు టి ఆర్ ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.