కందుకూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం కోసం ఆయన ప్రాణ త్యాగం చేశారని, ఆయన ప్రాణ త్యాగం వలన ఈరోజు మనకు ఆంధ్ర రాష్ట్రం లభించిందని వైసిపి నాయకులు తెలిపారు.