అనంతసాగరం వేమన ఫౌండేషన్ వారి సౌజన్యంతో చిలకలమర్రి జడ్పీ హైస్కూల్లో గురువారం ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేమన శతక పద్య పోటీలు నిర్వహించారు. విజేతలకు మెమొంటో, మెడల్స్, సర్టిఫికెట్లు, వేమన పద్యాలు పుస్తకాలను హెచ్ఎం సురేష్ చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థులు శంకర్, నిహారిక సంయుక్తంగా ప్రథమ స్థానంలో నిలిచారు. న్యాయ నిర్ణేతలుగా రమణ రాజు, కృష్ణారెడ్డి, మదీనా వ్యవహరించారు.