ఆత్మకూరు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు రైతులు భూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే గ్రామసభల ద్వారా పరిష్కరించుకోవాలని తహశీల్దార్ రత్న రాధిక అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలంలోని కరివేన గ్రామంలో ఎంపీపీ తిరుపాలమ్మ, సర్పంచ్ మాణిక్యమ్మల, ఆధ్వర్యంలో గ్రామసభను రెవిన్యూ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.