ఆత్మకూరు పట్టణంలోని మదరస స్కూల్ సమీపంలో పేకాడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు సిఐ ఓబులేసు, ఆధ్వర్యంలో ఎస్సై నారాయణరెడ్డి, మంగళవారం ఆత్మకురు పట్టణ మదరాస స్కూల్ సమీపంలో పేకాట స్థావరాలపై దాడి నిర్వహించగా పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు ఎస్సై నారాయణరెడ్డి మంగళవారం తెలిపారు. రూ. 1 లక్ష 3 వేలు, పేక ముక్కలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.