అనారోగ్యంతో ఆసుపత్రుల పాలై నిస్సహాయ స్థితిలో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని శ్రీశైలం నియోజకవర్గంఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఆత్మకూరు ఆదివారం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నియోజకవర్గంలోని 26 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 23 లక్షల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బుడ్డా అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.