వ్యవసాయ శాఖ అనుమతి లేని మందులు, ఎరువులను విక్రయించే డీలర్లపై చర్యలు తప్పవని కోడుమూరు ఏవో రవిప్రకాష్ హెచ్చరించారు. శనివారం కోడుమూరులోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను ఏవో తనిఖీ చేశారు. అనంతరం స్థానిక రైతు సేవా కేంద్రంలో దుకాణదారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలకంటే ఎక్కువ రేట్లకు అమ్మినా, రైతులు అడిగిన వాటిని ఇవ్వకపోయిన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.