పెద్దకడబూరులోని అగ్నిప్రమాద బాదిత శాంతిరాజు కుటుంబాన్ని ఆదుకోవడంలో దాతలు తమ దాతృత్వాన్ని చాటుకొంటున్నారు. శనివారం వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి రూ. 10 వేలు, సాక్షి విలేకరి మఠం గురుస్వామి 5 వేలు, మాజీ ఎంపీపీ రఘురామ్ 2, 500, దొడ్డిమేకల గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ 2 వేలు మొత్తం రూ. 19, 500 నగదును అందజేశారు. అధైర్య పడొద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందులో వైసీపీ నేతలు పాల్గొన్నారు.