శ్రావణమాసం సందర్భంగా శ్రీశైలం ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగింది. వేలాది మంది భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాలు కళకళలాడుతున్నాయి. భక్తులు ఆర్జిత సేవా టికెట్ల ద్వారా శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటున్నారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తులరద్దీ కనిపిస్తుంది. వరుసగా సెలవులు కలిసి వచ్చాయి.