గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఈవోఆర్డి నాగజ్యోతి బుధవారం పేర్కొన్నారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు నారాయణను గాంధీ జయంతి పురస్కరించుకొని స్వచ్ఛత హి సేవా కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణీయా, న్యాయశాఖ మంత్రి ఫరూక్ లు సత్కరించి, స్వచ్ఛతా హి సేవా పురస్కారం అందజేసినట్లు తెలిపారు.