శ్రీశైలం లో అభివృద్ధి పనుల పరిశీలన
పరిపాలనాంశాలలో భాగంగా ఇంచార్జి కార్యనిర్వహణాధికారి చంద్రశేఖరరెడ్డి ఏనుగుల చెరువు, పంచమఠాలు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రదేశాలను సోమవారం పరిశీలించారు. క్షేత్ర సుందరీకరణలో భాగంగా ఏనుగుల చెరువు ప్రాంత అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఏనుగుల చెరువు నందు బోటింగ్ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని సూచించారు.