మహానంది సమీపంలోని తెలుగుగంగ కాలువ బర్రెల బ్రిడ్జి వద్ద ఉన్న చెంచులక్ష్మి గూడెం గిరిజన రైతులకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ స్తంభాలను నెలకొల్పారు. చెంచుగూడెం రైతులకు పంటలను సాగు చేసుకోవడానికి అనుగుణంగా విద్యుత్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.