జూపాడు బంగ్లా మండలంలోని తంగడంచ సీడ్ ఫారం భూములను సీడ్ హబ్ గా అభివృద్ధి చేస్తామని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తెలిపారు. శుక్రవారం తంగడంచ ఫారం భూములను కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే జయసూర్య సంయుక్తంగా పరిశీలించారు. తంగడంచ సీడ్ ఫారం లో 16OO ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని అందులో ఏ రకాలైన సీడ్ అభివృద్ధి చేయాలని వ్యవసాయ అధికారులకు ప్రతిపాదనలు ఇవ్వవలసిందిగా కోరామన్నారు.