పల్లెల రూపురేఖలు మార్పునకు పల్లె పండుగ నాంది అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జి సోదరుడు రామకృష్ణ అన్నారు. శనివారం పులికనుమ, గవిగట్టు, బాపలదొడ్డి, పీకల బెట్ట గ్రామలలో సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం నిధుల ఉపయోగం చేసుకోలేని దుస్థితిలో ఉండేదని, ఇప్పుడూ కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతి పైసాను సద్వినియోగం చేసుకుంటుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.