కోడుమూరు మండలం గ్రామ పంచాయతీల ఆస్తులను పరిరక్షించుకోవాలని ఎంపీడీవో రాముడు, ఈవోఆర్డీ మంజుల అన్నారు. శుక్రవారం కోడుమూరు ఎంపీడీవో కార్యాలయంలో ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులకు ట్రైనర్ వెంకటేశ్వర్లు శిక్షణా తరగతులను నిర్వహించి, మాట్లాడారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ప్రైవేట్ లేఅవుట్, బిల్డింగ్ ప్లాన్ నిబంధనలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.