ఆళ్లగడ్డ పట్టణంలోని సద్దాం కాలనీకి చెందిన నోస్సం దస్తగిరి, నొస్సాం గౌసియా దంపతులపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం ఆళ్లగడ్డ పట్టణంలోని ముస్లిం పెద్దలు పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ రమేష్ బాబుకు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన సదరు నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని ముస్లిం పెద్దలు మీడియా ముఖంగా తెలిపారు.