సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభ శుక్రవారం రెవెన్యూ భవనంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏచూరి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడం మాత్రమే కాదు, భారత రాజ్యాంగం పీఠికలోని అంశాలకు రక్షకుడిగా తన జీవితాన్ని దారపోశారన్నారు. భారత ప్రజాస్వామ్యంలో ఆయన లేని లోటు పెద్ద శూన్యమన్నారు.