పట్టణంలోని వంశీ చైతన్య నర్సింగ్ ప్రైవేట్ హోమ్ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని బిజెపి జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ ఆరోపించారు. బుధవారం నర్సింగ్ హోమ్ ను కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బిజేపి జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ, TDP రాష్ట్ర కార్యదర్శి ఉమ్మీ సలీం మాట్లాడుతూ ఆసుపత్రి నందు లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని కంప్లైంట్ వచ్చినందుకు ఆస్పత్రికి వచ్చేమని తెలిపారు.