ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వైయస్సార్ కాలనీ లో ఆదివారం ఘోర పరిస్థితి. వర్షపు నీరు అధికంగా చేరడంతో సుమారు 6 అడుగుల మేరా వర్షపు నీరు చేరింది. కింద ఉన్న ఇల్లు లు అన్ని నీట మునిగాయి. దీంతో అక్కడ పరిస్థితి అయోమయంగా మారింది. అధికారులు పడవల సహాయంతో వెళ్లి వారికి ఆహారాన్ని అందించారు. ఆదివారం మోటార్ల సహాయంతో వర్షపు నీరును బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరో రెండు రోజులపాటు ఇలాగే ఉండే అవకాశం ఉంది.