విజయవాడలో ఘటన దురదృష్టం: మంత్రి

73பார்த்தது
విజయవాడలో కొండ చరియలు విరిగిపడటం దురదృష్టకరమైన సంఘటనని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. శనివారం రాత్రి విజయవాడ నగరంలో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందటం బాధాకరమన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ఆరోగ్యంగా ఉన్నారన్నారు.

தொடர்புடைய செய்தி