విజయవాడ: ఏపీఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా అడుగులు

73பார்த்தது
విజయవాడ: ఏపీఎస్డీఆర్ఎఫ్ బలోపేతం దిశగా అడుగులు
ఏపీఎస్డీఆర్ఎఫ్ బలోపేతందిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విపత్తుల సమయంలో అత్యవసర సహాయక చర్యల్లో పాల్గొనే ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ బృందాల పటిష్టతకు కృషి చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி