ముసునూరు మండలంలో త్రాగునీరు, డ్రైనేజ్, రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి ప్రజలకు హామీ ఇచ్చారు. 'పల్లె పండుగ' కార్యక్రమంలో భాగంగా అక్కిరెడ్డిగూడెం గ్రామంలో 15. 50 లక్షలతో నిర్మించనున్న 5 సిసి రోడ్ల పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. అనంతరం సురేపల్లి, లోపూడి, చెక్కపల్లి గ్రామాలలో సీసీ రోడ్లను శంకుస్థాపన చేయడం జరిగింది.